
స్వగ్రామానికి రాంచంద్రారెడ్డి మృతదేహం
● నేడు తీగలకుంటపల్లిలో అంత్యక్రియలు
● గత నెల 22న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
కోహెడరూరల్(హుస్నాబాద్): గత నెల 22న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ నేత కట్టా రాంచంద్రారెడ్డి మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని శనివారం ఉదయం కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామానికి తీసుకురానున్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా రాంచంద్రారెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన కుమారుడు రాజాచంద్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన తండ్రిని మందుగానే అరెస్ట్ చేసి పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలోనే ఎన్‌కౌంటర్ చేశారని ఆయన ఆరోపిస్తూ దీనిపై సిట్ ఏర్పాటు చేయాలని కోరాడు. దీంతో విచారణ పూర్తయ్యే వరకు మృతదేహం దహనం చేయకుండా భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం కేసును డిస్మిస్ చేసింది. దీంతో శనివారం ఉదయం రాంచంద్రారెడ్డి మృతదేహం స్వగ్రామానికి రానుంది.