పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే

Oct 18 2025 9:55 AM | Updated on Oct 18 2025 9:55 AM

పత్రి

పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే

‘సాక్షి’మీడియా పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరిపై పాత్రికేయ సంఘాల ఆందోళన

‘సాక్షి’పై, ఎడిటర్‌ ధనంజయ్‌రెడ్డిపై కేసులు, వేధింపులకు నిరసనగా.. కలెక్టరేట్‌ వద్ద జర్నలిస్టు సంఘాల ధర్నా అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌కు వినతిపత్రం జిల్లాలో పలుచోట్ల జర్నలిస్టుసంఘాల నిరసనలు

‘సాక్షి’మీడియా పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరిపై పాత్రికేయ సంఘాల ఆందోళన

సంగారెడ్డి జోన్‌: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’మీడియాపై, ఎడిటర్‌ ఆర్‌.ధనంజయ్‌రెడ్డిపై ఏపీ ప్రభుత్వం పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తోందని ఇది పత్రికాస్వేచ్ఛను కాలరాయడమేనని పలువురు పాత్రికేయులు మండిపడ్డారు. ‘సాక్షి’మీడియాపై, ఎడిటర్‌ ఆర్‌.ధనంజయ్‌రెడ్డిపై ఏపీ పోలీసులు నమోదు చేస్తున్న అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా పలు జర్నలిస్టు సంఘాలు ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సంగారెడ్డిలో పలు పాత్రికేయ సంఘాల ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలెక్టరేట్‌ ముందు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి మాట్లాడుతూ...ప్రజా సమస్యలను ఎత్తి చూపుతున్న ‘సాక్షి’మీడియాను ఏపీలోని చంద్రబాబు సర్కారు అణిచి వేసే ప్రయత్నం చేస్తోందని ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మీడియాను కట్టడి చేసేందుకు తప్పుడు కేసులు పెడుతూ జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తూ పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు సర్కారు తన తీరు మార్చుకోని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకులు పానుగంటి కృష్ణ, తెలంగాణ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టు అసోసియేషన్‌ (టెంజు) జిల్లా అధ్యక్షుడు అక్కపల్లి యోగానందరెడ్డి, టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.శ్రీధర్‌గౌడ్‌, కందిలి ఎడిటర్‌ సురకంటి రాజేందర్‌రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టులు శివ, కాకోల్ల నాగరాజు, నాగేశ్‌గౌడ్‌, శివశంకర్‌రావు, సాయినాథ్‌, వీరేందర్‌, అన్వర్‌, విల్సన్‌, పరంజ్యోతి, ఈశ్వర్‌, రాజు, విజయ్‌రావు, యాదగిరి, ‘సాక్షి’బ్యూరోఇన్‌చార్జి పి.బాలప్రసాద్‌, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శివప్రసాద్‌, రిపోర్టర్లు రాజశేఖర్‌, రామలింగుబాలయ్య, ఆంజనేయులు, వెంకటేశం, నర్సింహులు, ప్రశాంత్‌గౌడ్‌, నర్సింహులు, శ్రీనాథ్‌, వేణు, నగేశ్‌, నవాజ్‌, ‘సాక్షి’టీవీ రిపోర్టర్లు మహేశ్‌, ప్రదీప్‌, నరేశ్‌, సంతోశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే1
1/2

పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే

పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే2
2/2

పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement