
యూ టర్న్ తీసుకుంటుండగా..
మనోహరాబాద్(తూప్రాన్): జాతీయ రహదారి–44పై రెండు లారీలు ఢీకొని పల్టీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళుతున్న లారీ మండలంలోని కాళ్లకల్ శివారులోకి రాగానే యూ టర్న్ చేస్తున్న క్రమంలో లారీని ఢీకొట్టింది. దీంతో రెండు లారీలు పల్టీ కొట్టాయి. లారీ డ్రైవర్‌కు కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాఫిక్ స్తంభించడంతో జీఎమ్మార్ సిబ్బంది క్లియర్ చేశారు. గాయపడిన డ్రైవర్‌ను అంబులెన్సులో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఢీకొని పల్టీ కొట్టిన రెండు లారీలు
ఒకరికి తీవ్రగాయాలు