620 గ్రాముల గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

620 గ్రాముల గంజాయి పట్టివేత

Jun 16 2024 10:46 AM | Updated on Jun 16 2024 10:46 AM

620 గ్రాముల  గంజాయి పట్టివేత

620 గ్రాముల గంజాయి పట్టివేత

పటాన్‌చెరు టౌన్‌: మెదక్‌ ఎకై ్సజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 620గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎకై ్సజ్‌ సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ కథనం ప్రకారం.. ఇస్నాపూర్‌ దుర్గా వైన్‌ దుకాణం సమీపంలోని తేజ కాలనీ వద్ద ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడని సమాచారం తెలుసుకున్నారు. దీంతో అధికారులు శుక్రవారం రాత్రి ఇస్నాపూర్‌ చేరుకొని అనుమానిత వ్యక్తి జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన సాజిద్‌ ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగ్‌లో 620గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్టు గమనించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

గంజాయి అమ్ముతున్న

వ్యక్తి అరెస్ట్‌

మనోహరాబాద్‌(తూప్రాన్‌)/నర్సాపూర్‌: ఎక్సైజ్‌ టాస్క్‌పోర్స్‌ నిర్వహించిన దాడుల్లో గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌పోర్స్‌ సీఐ నరేందర్‌ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు పరిశ్రమల వాడలలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో భాగంగా మండలంలోని జీడిపల్లి శివారులో ఒడిశాకు చెందిన అక్షయ్‌నాయక్‌ గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నారన్నారు. అతడి వద్ద అరకిలో గంజాయి లభించిందని, దాని విలువ సుమారు రూ.50వేల ఉంటుదని చెప్పారు. అతడిని అరెస్ట్‌చేసి నర్సాపూర్‌ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement