
మాట్లాడుతున్న సీపీ శ్వేత
దుబ్బాక: ఈ నెల 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ ఎన్.శ్వేత అన్నారు. సోమవారం దుబ్బాక సీఐ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి ఎన్నికల విధి విధానాల గురించి దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రిటికల్, నాన్ క్రిటికల్, బైండోవర్లు, సీజ్ చేసిన డబ్బులు, నాన్ బెయిలబుల్ వారెంట్, ఎగ్జిగ్యూటివ్, ప్రయివేటు గన్ డిపాజిట్, ప్లాగ్ మార్చ్, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. శాంతియుత, ప్రశాతం వాతవరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరు సమష్టిగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల పై సామాన్యులకు నమ్మకం కలిగేలా పోలీసులు ముఖ్య పాత్ర వహించాలన్నారు. కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ నోడల్ అధికారి చంద్రశేఖర్, ఏసీపీ సురేందర్‌రెడ్డి, సీఐ కృష్ణ, ఎస్సైలు గంగరాజు, నరేష్, భువనేశ్వర్ రావు, తదితరులున్నారు.