కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

కార్యదర్శుల సమస్యలు పరిష్కరించండి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

అబ్దుల్లాపూర్‌మెట్‌: పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ.శ్రీనివాస్‌ కోరారు. శనివారం ఆయన సంఘం నాయకులతో కలిసి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఓపీఎస్‌లను జేపీఎస్‌లుగా మార్చాలని, జేపీఎస్‌లను నాలుగు సంవత్సరాల సర్వీస్‌ను నోషనల్‌ సీనియారిటీ కలిపించడంతో పాటు ఈ నెల 5వ తేదీన నిర్వహించిన కార్యదర్శుల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో చర్చించిన కార్యదర్శుల సమస్యలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మధుసుధన్‌ రెడ్డి, వైస్‌ ప్రెసిడెంట్‌ సతీశ్‌కుమార్‌, మహిళా ఉపాధ్యక్షులు వాణి, కవిత, కోశాధికారి పండరినాథ్‌, నాయకులు హరి నాయక్‌, మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సురేశ్‌, ప్రవీణ్‌, రాజేశ్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కుమార్‌కు నాయకుల వినతి

Advertisement
 
Advertisement
Advertisement