చేవెళ్ల: హైదరాబాద్–బీజాపూర్ రహదారి విస్తరణలో ఖానాపూర్ గేట్ వద్ద అండర్‌పాస్ నిర్మించాలని నాంచేరి సర్పంచ్ అశోక్, నాయకులు, గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శనివారం వారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైవే విస్తరణలో రోడ్డు ఎక్కువ ఎత్తులో నిర్మిస్తుండడంతో గ్రామాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడుతాయన్నారు. ఖానాపూర్ గేట్ వద్ద అండర్‌పాస్ ఏర్పాటు చేస్తే ఖానాపూర్, నాంచేరి, దేవరంపల్లి, రేగడిఘనాపూర్, ఇంద్రారెడ్డి నగర్ గ్రామాలకు వెళ్లే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. కేంద్రం ప్రభుత్వం, నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి అండర్‌పాస్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆయన సానుకులంగా స్పందించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, నాయకులు జైశంకర్‌గౌడ్, సాయిరాంగౌడ్, రాజలింగంగౌడ్, శ్రావణ్‌గౌడ్, వర్షవర్ధన్‌గౌడ్, గ్రామస్తులు, మండల నాయకులు ఉన్నారు.


