ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన సాగు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన సాగు

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

సొంతింటి కలనెరవేర్చడమే ధ్యేయం

ఆమనగల్లు: రైతు సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు సభ్యుడు డాక్టర్‌ మల్లురవి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. శనివారం ఆయన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నిర్మించిన ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ను, మండల పరిధిలోని శంకరకొండతాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. శంకరకొండతాండాలో ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సర్పంచ్‌ మండ్లి రాములు ఆధ్వర్యంలో గిరిజనుల సంప్రదాయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయా చోట్ల జరిగిన సభలలో ఎంపీ మల్లురవి మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగు గణనీయంగా పెరిగిందని రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు.

కల్వకుర్తి అభివృద్ధే ధ్యేయం

కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వమని చెప్పారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుందని ఆయన వివరించారు. నియోజక వర్గంలో దాదాపు రూ.600 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు అయిల శ్రీనివాస్‌గౌడ్‌, పీసీబీ సభ్యులు బాలాజీసింగ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పత్యానాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, మాజి వైస్‌ చైర్మన్‌ గుర్రం కేశవులు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ, హౌసింగ్‌ డీఏ శైలజ, ఎంపీడీఓ మాధురి, ఏఈ శాలిని, మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు వెంకటయ్య, మహేశ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు జగన్‌, మానయ్య, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌, ఫరీద్‌ తదితరులు పాల్గొన్నారు.

కడ్తాల్‌: నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం వారు మండల కేంద్రంతో పాటు మక్తమాదారం గ్రామంలో పర్యటించారు. ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌, పలువురు లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ నందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా మక్తమాధారం గ్రామంలో పోస్టాఫీస్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్‌ టవర్‌ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎంపీ, ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భిక్షపతి, ఉప సర్పంచ్‌ యాదగిరిరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి,, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్‌ నాయకులు బాలరాజు, చందోజీ, రాఘవేందర్‌, రవి, షాబుద్దీన్‌, రాజేశ్‌, శ్రీకాంత్‌, అశోక్‌, కృష్ణ, అధికారులు తదితరులు ఉన్నారు.

నాగర్‌కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లురవి

Advertisement
 
Advertisement
Advertisement