కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మే 10 వరకు కొనసాగుతుందని, ప్రతి ఒక్కరూ విధిగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ కార్యాలయం(ఓఆర్‌జీఐ)హెచ్‌ఎల్‌ఓ జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా స్వీయగణ నకు అవకాశం ఇచ్చిందన్నారు.
స్వీయగణన చేసుకోవచ్చు ఇలా
ముందుగా జనగణన అధికారిక (https:// se. census. gov. in) వెబ్‌సైట్‌కి వెళ్లాలి. కొత్త యూజర్‌గా రిజిస్టర్ అవ్వాలి. మీ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఒక యూజర్ ఐడి, పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత కుటుంబ వివరాలు నమోదు చేయాలి. ఇంటి చిరునామా సహా కుటుంబ సభ్యుల సంఖ్య, ఇంటి రకం, సౌకర్యాలు (నీరు, విద్యుత్ మొదలైనవి). వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. ఇందులో పేరు, వయస్సు, లింగం, విద్య, ఉద్యోగం, వివాహ స్థితి, భాష, మతం వంటి అంశాలను నమోదు చేయాలి. ఆ తర్వాత నమోదు చేసిన వివరాలు మళ్లీ చెక్ చేసి సబ్మిట్ చేయాలి. ఎంటర్ చేసిన సమాచారాన్ని ఒకసారి చెక్ చేసి, ఫైనల్‌గా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక అకనాలెడ్జ్‌మెంట్/రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీన్ని జాగ్రత్తపరుచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు సమాచారం ఇవ్వకూడదు. ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మార్పులు చేర్పులు చేయడం కుదరదు.
● వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు
నియమాలు తప్పనిసరి
● ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ
యాచారం: ఫ్యూచర్‌సిటీ కింద గుర్తించిన ప్రాంతంలో నింబంధనల ప్రకారమే వెంచర్లు, ఇంటి నిర్మాణాలను చేపట్టాలని, ఆ విధంగా ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించాలని ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ స్నేహ అన్నారు. శనివారం యాచారం మండల పరిషత్ కార్యాలయంలో నింబంధనల అమలుపై వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్యూచర్‌సిటీతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఆ విధంగానే అనుమతులు పొందాల్సి ఉంటుందని చెప్పారు. ఫ్యూచర్‌సిటీ విలీన గ్రామాల్లో నింబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. అథారిటీ పరిధిలో నింబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏపీఓ లక్ష్మీనారాయణ, మండల పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: డీజీపీ హోదాకు పదోన్నతి పొందిన సందర్భంగా నగర పోలీసు కమిషనర్ సజ్జనర్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.


