ఇబ్రహీంపట్నం: ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు ఫలప్రదం కావడంతో శనివారం ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద సంబురాలు జరుపుకొన్నారు. డిపో మేనేజర్ సుజాత, ఆర్టీసీ జేఏసీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా కార్మికులు గేట్ మీటింగ్ పెట్టుకుని సమ్మెలో పాల్గొన్న వారికి, మద్దతునిచ్చిన వారందరికి, సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్న ప్రభుత్వానికి ఽకృతజ్ఞత తెలిపారు.
ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సంబురాలు
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న డీఎం సుజాత
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి కార్మికుల క్షీరాభిషేకం


