శాంతి వర్దిల్లినప్పుడే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

శాంతి వర్దిల్లినప్పుడే అభివృద్ధి

Apr 26 2026 4:51 AM | Updated on Apr 26 2026 4:51 AM

మోమిన్‌పేట: ప్రపంచంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఏజేఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా ద్వితీయ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సంస్థలు శాంతిని కాపాడటంలో కీలకంగా మారాయన్నారు. నేడు కొన్ని దేశాలు యుద్ధం చేస్తూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి వర్ధిల్లినప్పుడే దేశాల అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం అన్ని దేశాలపై పడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అఖిల భారత శాంతి సంఘీభావ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, శుభప్రద్‌పటేల్‌ నాయకులు నరోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement