కొత్త కమిషనర్లొచ్చారు | - | Sakshi
Sakshi News home page

కొత్త కమిషనర్లొచ్చారు

Apr 25 2026 9:36 AM | Updated on Apr 25 2026 9:36 AM

తొందరపాటు నిర్ణయాలొద్దు ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. రౌడీషీటర్‌కు రిమాండ్‌ ఓ వ్యక్తిని బెదిరించి బైక్‌ను ఎత్తుకెళ్లిన రౌడీషీటర్‌ను పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 8లోu

తొందరపాటు నిర్ణయాలొద్దు ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు.

మల్కాజిగిరి పోలీసు బాస్‌గా సుమతి

‘ఫ్యూచర్‌’ సీపీగా తరుణ్‌జోషి

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో తొలిసారిగా పోలీసు విభాగంలో ఓ మహిళ పోలీసు బాస్‌గా నియమితులయ్యారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) చీఫ్‌గా ఉన్న 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి బడుగుల సుమతి మల్కాజిగిరి పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇక్కడి సీపీ అవినాష్‌ మహంతి బదిలీ అయ్యారు. ఆయనను డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు వెళ్లారు. రాష్ట్రానికి చెందిన మావోయిస్టు కీలక నేతలు లొంగుబాటు వ్యవహారంలో ఐజీ సుమతి కీలకంగా వ్యవహరించి ప్రత్యేక గుర్తింపును పొందారు. అగ్ర కమాండర్‌ తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవుజీ సహా 591 మందికి పైగా మావోయిస్టు నాయకులు లొంగిపోయిన ప్రక్రియలో సుమతి కీలక పాత్ర పోషించారు. 2001లో సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా వృత్తిని ప్రారంభించిన సుమతి.. వరంగల్‌లో తొలి పోస్టింగ్‌.. ఆ తర్వాత 2006లో కన్ఫర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణిగా పదోన్నతి పొందారు. హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌ డీసీపీగా, సీఐడీ మహిళా రక్షణ సెల్‌ డీఐజీగానూ సమర్థంగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) హోదాలో ఉన్నారు. సుమతి స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగోట్ల.

సాక్షి, సిటీబ్యూరో: ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషనర్‌గా డాక్టర్‌ తరుణ్‌జోషి నియమితులయ్యారు. 2004 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ కమిషనర్‌గా పని చేసిన జి.సుధీర్‌బాబు ఈ నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో తరుణ్‌ జోషిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంజాబ్‌కు చెందిన తరుణ్‌ జోషి పటియాలలోని ప్రభుత్వ డెంటల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌ నుంచి బీడీఎస్‌ పూర్తి చేశారు. 2004లో సివిల్‌ సర్వీసెస్‌ ఉత్తీర్ణులై ఉమ్మడి ఏపీ కేడర్‌లో ఐపీఎస్‌ అధికారిగా నియమితులయ్యారు. 2014–2016 వరకు ఆదిలాబాద్‌ ఎస్పీగా పని చేశారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా, హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ సీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏసీబీ డైరెక్టర్‌ గా, రాచకొండ సీపీగా పని చేశారు. విధులు నిర్వర్తిస్తూనే ఉన్నత విద్యను కూడా అభ్యసిస్తున్నారు. ఇప్పటికే ఓయూ నుంచి పోలీసు మేనేజ్‌మెంట్‌ విభాగంలో మాస్టర్స్‌ పూర్తి చేశారు. ఆపై ఎల్‌ఎల్‌బీలో చేరిన ఆయన ఓయూలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. పర్వతారోహణాన్ని హాబీగా మార్చుకున్నారు. 2017లో హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారు. అదే ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా హిమాలయాల్లోనే ఉన్న మౌంట్‌ రీనాక్‌ను అధిరోహించారు. ఇలా ఇప్పటి వరకు ఆయన పలు ప్రముఖ పర్వతాలను అధిరోహించారు.

Advertisement
 
Advertisement
Advertisement