అధునాతన బస్‌ షెల్టర్‌కు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

అధునాతన బస్‌ షెల్టర్‌కు శ్రీకారం

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

నక్కలపల్లిలో రీసైకిల్‌ ప్లాస్టిక్‌ బస్‌ షెల్టర్‌

భూమిపూజ చేసిన లయన్స్‌ క్లబ్‌ నేతలు

మొయినాబాద్‌ రూరల్‌: ప్రజలకు ఉపయోగపడేలా పర్యావరణ హితమైన రీసైకిల్‌ ప్లాస్టిక్‌ బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని జూబ్లీహిల్స్‌ లయన్స్‌ క్లబ్‌ హైదరాబాద్‌ అధ్యక్షురాలు రామసుందరి, అరిస్టాటిల్‌ పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎల్‌.శ్రీనివాస్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి గౌరీసతీష్‌ అన్నారు. నక్కలపల్లి పంచాయతీ అభ్యర్థన మేరకు కేజీరెడ్డి ఇంజనీరింగ్‌ ఆఫ్‌ టెక్నాలజీ సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ సోషల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌తో ఇందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బస్‌ స్టాప్‌ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యర్థాల సేకరణ డ్రైవ్‌లో భాగంగా సేకరించిన ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేసి బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి వినియోగిస్తున్నామని స్పష్టంచేశారు. ఇది 500 సంవత్సరాల వరకు మన్నేలా, 240 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను తట్టుకునేలా తయారు చేస్తున్నామని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా కేవలం చర్లపల్లి జైలులో మాత్రమే ఇలాంటి బస్‌ షెల్టర్‌ ఉందన్నారు. దీని నిర్మాణానికి సుమారు రూ.2.5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, కె.నాగేశ్వరి, కె.కరుణ, సాయిసత్య నారాయణరెడ్డి, విజ్ఞాన్‌ కళాశాల చైర్మన్‌ సతీష్‌, డాక్టర్‌ పి.సంయుక్త, బి.లింగం, గ్రామ సర్పంచ్‌ మంగళారం యాదయ్య, ఉప సర్పంచ్‌ గౌండ్ల నిరంజన్‌గౌడ్‌, వార్డు సభ్యులు మల్లేశ్‌, జీవన్‌, రవీందర్‌, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, గ్రామ కమిటీ అధ్యక్షుడు గౌరీ రవి, శ్రీకాంత్‌, భానుకుమార్‌, నవీన్‌, రమేష్‌, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement