వికారాబాద్: రైతుల ఎదురు చూపులు ఫలించి ఎట్టకేలకు సాగు సాయం డబ్బులు ఖాతాల్లో జమ కాగా, ఆ సంతోషం సగం వద్దే ఆగిపోయింది. గడి చిన యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు ఖాతాల్లో జమవడం ప్రారంభమై నెల గడుస్తున్నా ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటి వరకు కేవలం అరవై శాతం భూమికే సాగు సాయం అందింది. మరో నలభై శాతం భూమికి సంబంధించిన రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తొలి విడతగా ప్రతీ రైతుకు ఎకరానికి డబ్బులు జమ చేసిన ప్రభుత్వం, మూడు రోజుల క్రితం రెండెకరాలలోపు వారందరికీ నగదు వేసింది. రెండు విడతల్లో కలిపి రెండెకరాల వరకు 2,82,509 మంది రైతులకు రూ.231.82 కోట్ల నిధులు జమయ్యాయి.
మిగిలిన వారికి ఎప్పుడో..
జిల్లాలో మొత్తం రైతు భరోసాకు అర్హులైన రైతులు 3,27,561 మంది ఉండగా, వీరు 6,45,145 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు. ఇందులో ఒక్కో రైతుకు రెండెకరాల వరకు డబ్బులు అందాయి. మరో 2.8 లక్షల మందికి రూ.155.25 కో ట్లు జమ కావాల్సి ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలలైనా ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. అప్పటికీ ఖరీఫ్ పంటల సాగు కూ డా పూర్తవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తు న్నారు. ఇదిలా ఉండగా అర్హులైన వారందరికీ చెల్లించాల్సిన మొత్తంపై బిల్లులు పూర్తి చేసిన వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే ట్రెజరీకి పంపించారు.
ముంచుకొస్తున్న ఖరీఫ్..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత గవర్నమెంట్ దీన్ని రైతు భరోసాగా మార్చింది. సర్కారు ఏదైనా పంటలు సాగు చేసే సమయంలో రైతులకు సాయం అందడం లేదు. ఖరీఫ్ సమీపిస్తున్నా రబీ డబ్బులే రాలేదు.. ఖరీఫ్ సాయం అందే సరికి ఇంకెంత కాలం పడుతుందోనని విమర్శిస్తున్నారు.
నత్తనడకన సాగు సాయం
రెండు విడతల్లో.. అందింది రెండెకరాలకే
ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు


