తొందరపాటు నిర్ణయాలొద్దు | - | Sakshi
Sakshi News home page

తొందరపాటు నిర్ణయాలొద్దు

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. సమ్మె కారణంగా పలు చోట్ల కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నం డిపోలో కార్మికులు, నాయకులకు పలు సూచనలు చేశారు. శాంతియుతంగా సమ్మెలో పాల్గొనాలని, ఎట్టి పరిస్థితిలోనూ క్షణికావేశానికి లోను కావొద్దని సూచించారు. ఆవేశానికి లోనయ్యే కార్మికులు సమ్మెలో పాల్గొనకుండా చూడాలని జేఏసీ నేతలకు సూచించారు. అతనితోపాటు ఏసీపీ కేపీవీ రాజు, సీఐలు మహేందర్‌, మధు, డీవీఎం శంకర్‌నాయక్‌, డీఎం సుజాత, ఎస్‌ఐ చందర్‌సింగ్‌ ఉన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు డీసీపీ సూచన

Advertisement
 
Advertisement
Advertisement