పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా | - | Sakshi
Sakshi News home page

పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Apr 25 2026 9:30 AM | Updated on Apr 25 2026 9:30 AM

ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి

శంకర్‌పల్లి: బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా శంకర్‌పల్లి మండలం గోపులారం గ్రామానికి చెందిన తొండ రవిని నియమించినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్‌.రామచంద్రరావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతికిరణ్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేలా పనిచేస్తానన్నారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ

షాద్‌నగర్‌రూరల్‌: పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో శుక్రవారం బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రాజమౌళి మహేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, బీసీ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మనళిని హాజరయ్యారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, సంక్షేమం కోసం సంఘంపని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రాఘవేందర్‌గౌడ్‌, గోపాల్‌, అనిత, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement