బ్రిడ్జి గుంతలో పడిన మహిళ | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి గుంతలో పడిన మహిళ

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

తాండూరు రూరల్‌: ప్రమాదవశాత్తు ఓ మహిళ బ్రిడ్జి గుంతలో పడింది. ఈ ఘటన తాండూరు పట్టణం పాత తాండూరు రైల్వే బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాణిక్‌ నగర్‌కు చెందిన ఆసియా బేగం కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి తాండూరులో మార్కెట్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో బ్రిడ్జి పిల్లర్ల కోసం తవ్విన గుంతలో పడింది. స్థానికులు నిచ్చెన సాయంతో ఆసియాబేగంను బయటకు తీశారు. ఆమెను తాండూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెన్నెముక వద్ద బలమైన గాయం కావడంతో హైదరాబాద్‌కు తరలించి వైద్యం చేయిస్తున్నట్లు తెలిసింది. గుంత వద్ద కాంట్రాక్టర్‌ సూచిక బోర్డు పెట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement