ప్రభుత్వ లాంఛనాలతో లక్ష్మీనృసింహుడి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ లాంఛనాలతో లక్ష్మీనృసింహుడి కల్యాణం

Apr 25 2026 9:12 AM | Updated on Apr 25 2026 9:12 AM

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం సమీపంలో స్వయంభువుగా వెలిసిన శ్రీలక్ష్మీనృసింహస్వామి కళ్యాణోత్సవాన్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. స్థానిక మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ మున్సిపల్‌ అధ్యక్షుడు ఆకుల ఆనంద్‌కుమార్‌, కౌన్సిలర్లతో కలిసి ఆలయ భక్త బృందం శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 30న నిర్వహించే స్వామివారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓ ప్రవీణ్‌కుమార్‌, తాళ్లపల్లి కృష్ణ, తమ్మల కృష్ణ, సొప్పరి లక్ష్మణ్‌, సూరమోని బాబు, శ్రీనివాసచారి, అశోక్‌రెడ్డి, అర్‌కే కృష్ణ, శంకర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement