ఇంద్రారెడ్డి ఆశయాలను సాధిద్దాం | - | Sakshi
Sakshi News home page

ఇంద్రారెడ్డి ఆశయాలను సాధిద్దాం

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

ఇంద్రారెడ్డి ఆశయాలను సాధిద్దాం

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

కౌకుంట్లలో ఇంద్రారెడ్డి వర్ధంతికి హాజరైన నాయకులు

చేవెళ్ల: ఇంద్రారెడ్డి కుటుంబానికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది చేవెళ్ల ప్రజలేనని.. నియోజకవర్గ ప్రజలకు ఇంద్రారెడ్డి కుటుంబ ఎప్పటికీ రుణపడి ఉంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె చేవెళ్ల, ఖానాపురంగేట్‌, అంతారంగేట్‌ వద్ద ఆయన విగ్రహాలకు ఘన నివాళి అర్పించారు. అనంతరం మండల పరిధిలోని కౌకుంట్లలో ఆయన సమాధికి తనయులు కార్తీక్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, పలువురు నాయకులతో కలిసి పూలమాలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేవెళ్ల గడ్డ అంటే స్వర్గీయ ఇంద్రారెడ్డి పేరు గుర్తుండి పోయేలా పాలన సాగించారన్నారు. ఆయన అనుచరులు పార్టీలకు అతీతంగా జిల్లాలో ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఆయన ఆయన సాధనకు నిరంతరం కృషి చేద్దామన్నారు. ఆయన కలలు కన్న తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆయన వెంట కాంగ్రెస్‌ నాయకులు, బీఆర్‌ఎస్‌ వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ పి.కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు అంజనేయులు, ప్రభాకర్‌, పి.హన్మంత్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మల్లారెడ్డి, మల్లేశ్‌, శ్రీధర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బాల్‌రాజ్‌, యాదయ్య, నర్సింలు, రవీందర్‌, మాధవ్‌గౌడ్‌, రామగౌడ్‌, రాజు, సురేందర్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, గోపాలకృష్ణ, రాజు, చంద్రశేఖర్‌, ప్రభాకర్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, పలువురు నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాం

మొయినాబాద్‌: ఇంద్రారెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా నిలబెట్టిన చేవెళ్ల ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం దివంగత హోంమంత్రి ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా మున్సిపల్‌ కేంద్రంలో ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంద్రారెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఇంద్రారెడ్డి కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తనయుడు కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, కొత్త నర్సింహారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు జయవంత్‌, సీనియర్‌ నేతలు షేక్‌ మహబూబ్‌, కృష్ణారెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్లు డప్పు రాజు, రవూఫ్‌, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ జీఎన్‌ రాజు, మాజీ సర్పంచ్‌లు కోట్ల నరోత్తంరెడ్డి, శ్రీహరియాదవ్‌, సుధాకర్‌యాదవ్‌, ఎంపీటీసీ మాజీ సభ్యులు మాణిక్‌రెడ్డి, శ్రీనివాస్‌, నాయకులు రాంచందర్‌, సురేందర్‌గౌడ్‌, సూరియాదవ్‌, తిరుపతిరెడ్డి, నవీన్‌, అరవింద్‌, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిలుకూరు ఇంద్రారెడ్డి నగర్‌ కాలనీలోని ఆయన విగ్రహానికి మాజీ సర్పంచ్‌ పురాణం వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement