సోషల్‌ మీడియా వేదికగా వేధింపులు | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా వేదికగా వేధింపులు

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

సోషల్‌ మీడియా వేదికగా వేధింపులు

యువకుడికి రిమాండ్‌

కడ్తాల్‌: సోషల్‌ మీడియాలో ఫొటోలు షేర్‌ చేస్తానంటూ యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని కడ్తాల్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సీఐ గంగాధర్‌ తెలిపిన ప్రకారం.. కేశంపేట మండలం చౌలపల్లి పంచాయతీ పరిధిలోని మీనమోనిపల్లికి చెందిన అనపూలస గోవర్ధన్‌ కడ్తాల్‌ మండలానికి చెందిన ఓ యువతితో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెబుతూ ఆమెతో కలిసి ఫొటోలు దిగాడు. అనంతరం సదరు యువతిని ఒంటరిగా కలవాలని లేదంటే ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గోవర్ధన్‌ను కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం జ్యుడీషియల్‌ రిమాండ్‌ తరలించాలని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement