సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య
ఇబ్రహీంపట్నం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నేరవేర్చాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.యాదయ్య డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఎం మద్దతు ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కారన్నారు. ఆర్టీసీ కార్మికుల 32 సమస్యల డిమాండ్ల పరిష్కారానికి వేసిన ఐఏఎస్ అధికారుల కమిటీ నాలుగు వారాల గడువు కోరడం సమ్మెను నీరుగార్చడమేనన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి
పాలమాకుల జంగయ్య
షాబాద్: నాలుగు లేబర్ కోడులను రద్దు చేసే వరకు పోరాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో మేడే వాల్ పోస్టర్లును విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడులను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపుతో అంతర్జాయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో లక్షలాది మంది కార్మికుల తరపున ఏఐటీయూసీ పోరాడాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ.. అన్ని రంగాల కార్మికులకు రూ.26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్లర్లు కార్మికులపై పెత్తనం చేస్తూ ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం, వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, బీసీ హక్కుల సాధన సమితి మండల కన్వీనర్ పామాలకు ఆనందం, ఏఐటీయూసీ మండల కన్వీనర్ నారాయణ, సహాయ కార్యదర్శి నర్సింలు, డీహెచ్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, రఘురాం, మధూకర్, తదితరులున్నారు.


