మహేశ్వరం: భారతదేశంలోపి సనాతన హిందూ ధర్మం గొప్పదనం విశ్వవాప్తం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. బుధవారం మండల పరిధిలోని అమీర్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందువులందరినీ ఏకం చేయడం, సమాజంలో ప్రేరణాశక్తిని రగిలించడం, నిరంతరం ధర్మ పరిరక్షణ కోసం సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణకు ఇలాంటి సమ్మేనాలు అవసరమన్నారు. సమాజ శ్రేయస్సుకు హిందువులు ఏకతాటిపై నడవాలన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని ఇందుకు ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు. అనంతరం స్వామిజీని హిందూ సమ్మేళన నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. హిందూ సమ్మేళనానికి సహకరించిన వారిని నిర్వాహకులు ఘనంగా అభినందించి సన్మానించారు. సమ్మేళనంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, అలరించాయి. ఈ కార్యక్రమంలో విద్యాభారతి ప్రచార విభాగం దక్షిణ క్షేత్ర సంఘటన మంత్రి లింగం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర సేవిక సమితి నాయకులు గంజాం పద్మజ భగవత్, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆదిత్య పరాశ్రీ స్వామిజీ


