ఆర్టీసీ సమ్మె హారన్
ఇబ్రహీంపట్నం: డిపోనకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
● ఆర్టీసీ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్
మహేశ్వరం: మహేశ్వరం ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మెలో పాల్గొని నిరసన తెలిపారు. తెల్లవారుజాము నుంచి డిపోలో పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, టెక్నీషియన్లు, మెకానిక్‌లు, ఇతర కార్మికులు డిపో వద్దకు భారీగా చేరుకొని గేటు ఎదుట బైఠాయించారు. డిపోలో 75 ఆర్టీసీ బస్సులు( 63 ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు, 12 ప్రైవేట్ బస్సులు)లో 12 ప్రైవేట్ ఆర్టీసీ బస్సులు మాత్రమే ప్రైవేట్ డ్రైవర్లతో నడిపించారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో డిపోకే పరిమితమయ్యాయి. ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా మహేశ్వరం సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్‌ఐలతో బందోబస్తు నిర్వహించారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని గ్రామాలకు కొన్ని ట్రిప్పులు నడిపారు. సమ్మె కారణంగా ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోలు, ట్యాక్సీ కార్లలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణించారు. ఈ సందర్బంగా ఆర్టీసీ జేఏసీ నాయకుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికై న ఆర్టీసీ సమ్మైపె జోక్యం చేసుకోవాలని కోరారు. ఎలక్ట్రికల్ బస్సులతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన చేస్తోందన్నారు. ఆర్టీసీని హైదరాబాద్‌లో లేకుండా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఆర్టీసీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మెను విరమించమని పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మెకు చేపట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. రెండేళ్లయినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోవడంతోనే సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. హామీలు అమలు చేసే వరకు పోరాటం ఆపమని హెచ్చరించారు.
డిపోలకే పరిమితమైన బస్సులు
ఇబ్బంది పడిన ప్రయాణికులు
జోరుగా ప్రైవేటు వాహనదారుల దోపిడీ


