యాచారం: ఎండల తీవ్రత, పనులు చేసే సమయంలో చెమట తీస్తున్న కూలీలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో వారు పస్తులుండాల్సిన దుస్థితి వస్తుంది. యాచారం మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం నిత్యం 1,500 మంది నుంచి రెండు వేల మంది వరకు కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. కూలీల ఉపశమనం, వడదెబ్బకు గురి కాకుండా ఈజీఎస్ అధికారులు మండల ప్రభుత్వాసుపత్రి నుంచి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా 500 మంది కూలీలకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందజేయడంతో పాటు పనులు చేసే ప్రాంతాల్లో టెంట్లు వేస్తున్నారు. ఎండల తీవ్రతలో ఉపాధి పనులు చేయరాదని ఎంపీడీఓ రాధారాణి నిత్యం ఏదో ఒక గ్రామంలోకి వెళ్లి కూలీల్లో చైతన్యం కల్పిస్తున్నారు.


