ఐదు నెలలుగా డబ్బులు వస్తలేవు | - | Sakshi
Sakshi News home page

ఐదు నెలలుగా డబ్బులు వస్తలేవు

Apr 22 2026 8:42 AM | Updated on Apr 22 2026 8:42 AM

షాబాద్‌: ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు తాగునీరు, నీడ కోసం టెంట్‌ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో పనులు చేస్తున్న కూలీలను సాక్షి విజిట్‌ చేసింది. ఐదు నెలలుగా పని చేస్తున్న తమకు కూలీ డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల వస్తాయి.. రేపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఉపాధి హామీ ఫీల్ట్‌ అసిస్టెంట్లుకు మూడు నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్ల నీడకు వెళ్తున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు కూలీ డబ్బులు అందేలా చూడాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement