కొందుర్గు: ఉపాధిహామీ కూలీలు మండుటెండలో కూలిపనులు చేస్తున్నారు. మండలంలోని 22 గ్రామపంచాయతీలకు గాను 625 మంది కూలీలు పనులకు వస్తున్నారని ఏపీఓ నర్సింగ్‌రావు తెలిపారు. అయితే రేగడిచిల్కమర్రి, బైరంపల్లి, ఆగిర్యాల గ్రామాల్లో టెంట్లు లేవు. జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో 623 మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. చాలా గ్రామాల్లో కూలీలు సేదతీర్చుకోవడానికి టెంట్లు లేవు. ఇక తాగడానికి నీటివసతి, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో లేవు. దీంతో కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.


