అర్ధరాత్రి అడవిలో మంటలు | - | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అడవిలో మంటలు

Apr 22 2026 8:42 AM | Updated on Apr 22 2026 8:42 AM

ఆమనగల్లు: తలకొండపల్లి మండలం పడకల్‌ గ్రామ సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సమీప గ్రామాల ప్రజలు వెంటనే తలకొండపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన సీఐ జానకిరాంరెడ్డి, ఎస్‌ఐ శేఖర్‌లు సంఘటనా స్థలం వద్దకు పోలీసులను పంపించారు. అనంతరం ఫైర్‌ స్టేషన్‌లకు సమాచారం అందించడంతో షాద్‌నగర్‌ నుంచి వచ్చిన ఫైర్‌ సిబ్బంది అటవీప్రాంతంలో మంటలను ఆర్పివేశారు. అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలలో విలువైన కానుగు, నీలగిరి, మోదుగు తదితర చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి.

ముదిరాజ్‌లకు

న్యాయం చేయాలి

చేవెళ్ల: ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చాలని కోరుతూ ముదిరాజ్‌ సంఘం రాష్ట్ర నాయకురాలు కోట్ల పుష్పలత కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌లోని అమరవీరుల స్థూపం వరకు చేపట్టిన పాదయాత్ర మంగళవారం చేవెళ్లకు చేరింది. ఈ సందర్భంగా ఆమె పండుగల సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీ–డీలో ఉన్న ముదిరాజ్‌లకు సరైన న్యాయం జరగడం లేదని అన్నారు. అన్ని రంగాల్లో అవకాశాలు దక్కాలంటే బీసీ–ఏలోకి మార్చాలని ఎన్నో రోజులుగా డిమాండ్‌ ఉందని, దీనిని ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్‌సంఘం మండల నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement