చేవెళ్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉపాఽధిహామీ పథకం నిబంధనల కొర్రీతో వేసవి ఎండల్లో కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపించటం లేదు. మండలంలో ప్రస్తుతం రెండు వేలకుపైగా జాబ్‌కార్డులు ఉంటే 220 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే పనులు చేసేందుకు సైతం ముందుకు రావటంలేదు. వేసవి ఎండలు మండుతున్న నేపథ్యంలో కూలీలకు పనిచేసే చోట తాగునీటి వసతి, టెంట్లు, పనిముట్లు అందించాలనే నిబంధనలు ఉన్నా కొన్నేళ్లుగా పట్టించుకోవటం లేదని కూలీలు వాపోతున్నారు. ఉపాధి పనుల నిర్వహణ ప్రస్తుతం పంచాయతీలకు అదనపు భారంగా మారుతుంది. కూలీలకు మూడు నెలల నుంచి డబ్బులు సైతం రావటం లేదని వాపోతున్నారు.


