షాద్‌నగర్‌రూరూల్: ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు స్వాములయ్య డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట మంగళవారం గేట్ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేపట్టాలని, చట్ట వ్యతిరేక డ్యూటీలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కారుణ్య నియామకాల్లో వచ్చిన కండక్టర్లను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని, కార్మిక యూనియన్లను పునరుద్ధరించాలని కోరారు. 2017కు సంబంధించిన ఎరియర్స్‌ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిపో జేఏసీ నాయకులు నర్సింలు, అర్జున్‌కుమార్, తిరుపతయ్య, రాజు, సత్తయ్య, కేడీఎస్ కుమారి, లక్ష్మి, మహేశ్, రవికుమార్, ఎండీ హైమత్, వైఎల్‌ఎస్ రావు, నర్సింలు, శ్రీనివాసులు, చెన్నయ్య, రఫీక్, శ్రీను, యాదయ్య, గోపాల్, శంకర్, రాజశేఖర్, నరేష్, శ్రీనివాసులు, బాలీశ్వర్, శ్రీరాములు, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు స్వాములయ్య


