విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Apr 22 2026 8:36 AM | Updated on Apr 22 2026 8:36 AM

విద్యుదాఘాతంతో రైతు మృతి

చేవెళ్ల: విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన మంగళవారం కౌకుంట్లలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎండీ ఫయాజ్‌ (32) తనకున్న ఎకరం పొలంతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని అన్నదమ్ములతో కలిసి ఉమ్మడి వ్యసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఈక్రమంలో వారం రోజులుగా చేతికి వచ్చిన క్యారెట్‌ పంటను తీస్తున్నారు. రోజూ మాదిరిగానే పొలంలో నుంచి తీసిన క్యారెట్‌ను మిషన్‌లో వేసి కడుగుతుండగా ఫయాజ్‌ విద్యుత్‌ షాక్‌కు గురై పడిపోయాడు. అక్కడే ఉన్న సోదరులు కరెంటు సరఫరా ఆపేసి వెంటనే చేవెళ్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య నస్రీన్‌బేగం, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ మల్లారెడ్డి, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement