వేసవి వేళ జాగ్రత్త | - | Sakshi
Sakshi News home page

వేసవి వేళ జాగ్రత్త

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

● కలెక్టర్‌ నారాయణరెడ్డి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యా హ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లక పోవడమే ఉత్తమం. అనివార్యమైతే వెంట గొడుగు, తాగునీరు, తలకు టోపీ, కళ్లకు సన్‌గ్లాసెస్‌ ధరించాలి’ అని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. సోమ వారం ప్రజావాణిలో బాధితుల నుంచి 48 అర్జీలను స్వీకరించారు. ఆయా అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హీట్‌వేవ్స్‌ నేపథ్యంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు తరచూ నీరు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని అన్నారు. పిల్ల లు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్త లు పాటించాలని తెలిపారు. హీట్‌వేవ్‌ ప్రభావంతో అలసట, తలనొప్పి, వాంతులు, చెమటలు ఎక్కువగా పట్టటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యశాలకు వెళ్లాలని సూచించారు. కూలీలు, కార్మికులు ఉదయం.. సాయంత్రం సమయాల్లోనే పనులు నిర్వహించుకోవాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బ బారి న పడకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, డీఆర్‌ఓ సంగీత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కేంద్రాలు ప్రారంభించాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: వరి ధాన్యం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు. ఆయా కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement