జనగణన శిక్షణ కేంద్రం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

జనగణన శిక్షణ కేంద్రం పరిశీలన

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొనసాగుతున్న జనగణన శిక్షణ కేంద్రాన్ని సోమవారం జనగణన కార్యకలాపాల డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ భారతి హోళికేరి సందర్శించారు. ఆమెకు సరూర్‌నగర్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ స్వాగతం పలికారు. అనంతరం ఆమె అక్కడ ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను పర్యవేక్షించారు. ట్రైనింగ్‌పై వారిని అడిగి తెలుసుకున్నారు.

90 ఎకరాల్లో

మామిడి పంటకు నష్టం

ఇబ్రహీంపట్నం రూరల్‌: అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఉద్యానవన శాఖ అధికారి నవీన తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలోని తులేకలాన్‌లో నష్టపోయిన మామిడి తోటలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 90ఎకరాల్లో రైతు లు పంట నష్టపోయాయని, కాత పూర్తిగా రాలిపోయిందని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement