చేవెళ్ల: బీసీలకు అన్ని రంగాల్లో సముచిత న్యాయం జరిగేలా ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు వరప్రసాద్ అన్నారు. మండలంలోని కమ్మెర సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సోమవారం చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ సంఘం అనేది వెనుకబడిన వర్గాల హక్కులు, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పోరాడే శక్తిగా అభివర్ణించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి హక్కుల సాధనకోసం పోరాడాలన్నారు. భవిష్యత్తు తరాలకు మంచి అవకాశాలు కల్పించేందుకు అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. చేవెళ్ల నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షుడిగా శ్రీనివాస్‌గౌడ్‌ను నియమించినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘం నాయకులు ప్యాట జయ శ్రీకాంత్, గిరిబాబు, నర్సింలు, మనీష్‌గౌడ్, రవీందర్, సత్యనారాయణ, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


