కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం వనంపల్లి సర్పంచ్‌ను అసభ్యపదజాలతో దూషించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్ తెలిపారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. వనంపల్లిలో ఆదివారం సర్కస్ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్కస్ నిర్వహకులు సర్పంచ్ అరుణను స్టేజ్‌పైకి ఆహ్వానించారు. అక్కడే ఉన్న గ్రామస్తులు సమ్మయ్య, నవీన్ సర్పంచ్‌ను అసభ్యపదజాలతో దూషించారు. సర్పంచ్ దంపతులు అక్కడ నుంచి వెళ్తుండగా సదరు వ్యక్తులు యాదయ్యపై దాడిచేశారు. సోమవారం సర్పంచ్ భర్త యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
దుద్యాల్: అక్రమంగా విక్రయిస్తున్న రేషన్ బియాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మండలంలోని పోలేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. సివిల్ సప్ల య్ డీటీ గణపతి రెడ్డి సమాచారంతో దు ద్యాల్ పోలీసులు ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీ చేసి నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి యూసుఫ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చోరీకి గురైన
సెల్‌ఫోన్ల అప్పగింత
ధారూరు: చోరీకి గురైన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని సోమవారం ధారూరు ఎస్‌ఐ రాఘవేందర్ బాధితులకు అప్పగించారు. సీఈఐఆర్ పోర్టర్ ద్వారా చోరీకి గురైన సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చింతకుంట గ్రామానికి చెందిన పి.రాజేందర్‌రెడ్డికు, మోమిన్‌ఖుర్దుకు చెందిన చిన్న, ధారూరుకు చెందిన వెంకటేశ్‌కు సెల్‌ఫోన్లు ఇచ్చామని ఎస్‌ఐ వివరించారు.


