కలుషిత నీటి సరఫరా | - | Sakshi
Sakshi News home page

కలుషిత నీటి సరఫరా

Apr 21 2026 6:07 AM | Updated on Apr 21 2026 6:07 AM

నీటి నుంచి దుర్వాసన

పట్టించుకోని అధికారులు

మణికొండ: పది రోజులుగా కలుషితంగా సరఫరా అవుతోందని మణికొండ డివిజన్‌ కేంద్రంలోని పాత గ్రామం ప్రజలు పేర్కొంటున్నారు. నీరు దుర్వాసనతో పాటు నురుగుగా వస్తోందని చెబుతున్నారు. ఈ విషయాన్ని జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సిబ్బందిని పంపించి నీటి నాణ్యతను పరీక్ష చేయిస్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటితో స్నానాలు చేస్తే దురద, దద్దుర్లు వస్తున్నాయని తెలిపారు. జలమండలి అధికారులు వెంటనే స్పందించి కలుషిత నీటి సరఫరాను అరికట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement