కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పాలనలో రైతులకు కష్టాలు

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

ఆమనగల్లు: కాంగ్రెస్‌ పాలనలో రైతన్నలకు కష్టాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. తలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన మొక్కజొన్న, వరి పంటలను ఆదివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేశ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలన స్వర్ణయుగం లాంటిదని పేర్కొన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. న్యాయం చేయకపోతే రైతుల పక్షాన బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్‌, మాజీ ఎంపీపీలు శ్రీనివాస్‌యాదవ్‌, నిర్మల శ్రీశైలంగౌడ్‌, తలకొండపల్లి సర్పంచ్‌ శేఖర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement