దేవాలయ భూములను పరిరక్షించాలి | - | Sakshi
Sakshi News home page

దేవాలయ భూములను పరిరక్షించాలి

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

కందుకూరు: మండలంలోని పులిమామిడి పరిధిలోని చీకటి వేంకటేశ్వరస్వామి దేవాలయానికి సంబంధించిన భూములను పరిరక్షించాలని మైదాన ప్రాంత సేవాలాల్‌ సేన అధ్యక్షుడు రఘురాం రాథోడ్‌ డిమాండ్‌ చేశారు. దేవాలయాన్ని ఆదివారం గిరిజన నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడు, బంజారాల ఆరాధ్య గురువు హాతిరామ్‌ బావాజీ ఆలయ నిర్మాణం కోసం దేవాలయ భూముల నుంచి 20 ఎకరాలు కేటాయించేలా కృషి చేయాలని ఆలయ చైర్మన్‌ రాజశేఖర్‌శర్మకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రఘురాంరాథోడ్‌ మాట్లాడుతూ.. 240 ఎకరాల ఆలయ భూమిని లీజు పేరుతో కొందరు వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేవాలయ భూములను కాపాడుకుందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సేవాలాల్‌ సేన జిల్లా అధ్యక్షుడు నరేష్‌నాయక్‌, యూత్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌నాయక్‌, సార్లరావులపల్లి, అన్నోజిగూడ, మురళీనగర్‌ సర్పంచులు శ్రీనునాయక్‌, రమావత్‌ సురేష్‌నాయక్‌, నేహభాస్కర్‌నాయక్‌, మాజీ సర్పంచ్‌ ఇ.రాంచంద్రారెడ్డి, నాయకులు రుక్మానాయక్‌, నరసింహానాయక్‌, లక్ష్మణ్‌నాయక్‌, శ్రీనివాస్‌నాయక్‌, రవినాయక్‌, శ్రీనునాయక్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement