అక్రమ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. | - | Sakshi
Sakshi News home page

అక్రమ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

అక్రమ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. 8లోu విద్యార్థులు చదువులో రాణించాలి

షాద్‌నగర్‌రూరల్‌: విద్యార్థులు చదువులో రాణించాలని నేషనల్‌ పోలీస్‌ అకాడమీ విశ్రాంత డైరెక్టర్‌ అరుణ బహుగుణ అన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బూర్గుల గ్రామంలో ఉన్న ప్రగతి వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బూర్గుల నర్సింగ్‌రావు మనుమడు రాజారావు జ్ఞాపకార్థం కాశిరెడ్డిగూడ, కడియాలకుంట, బూర్గుగడ్డ తండా విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరుణ బహుగుణ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల్లో ఎంతో ప్రతిభ ఉంటుందని అన్నారు. ప్రతి విద్యార్థి చిన్న నాటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకోవాలని.. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ సీతారాం, ప్రగతి వెల్ఫేర్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అలోక్‌ అగర్వాల్‌, మాళవిక, ప్రవీణ్‌, అరుణ్‌, ప్రణయ్‌, విశ్రాంత హెచ్‌ఎంలు సురేష్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement