ఆమనగల్లు: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటస్ఫూర్తి అందరికీ ఆదర్శమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాలలో గౌడసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో గొప్ప విప్లవ వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర నాయకుడు తూళ్ల వీరేందర్‌గౌడ్, పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్, కల్వకుర్తి గౌడ సంఘం అధ్యక్షుడు చుక్క అల్లాజీగౌడ్, వెల్జాల గౌడ సంఘం అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాట గీత తదితరులు పాల్గొన్నారు.


