ఉల్లాసంగా.. ఉత్సాహంగా | - | Sakshi
Sakshi News home page

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

ఆమనగల్లు: దాదాపు 47 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న వారంతా మళ్లీ ఓ చోటుకి చేరి సందడి చేశా రు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సాధకబాధకలు పంచుకున్నారు. అయితే అందులో ని ఓ పూర్వ విద్యార్థి ప్రస్తుత కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కావడం విశేషం. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1978–79 బ్యాచ్‌ పదో తరగతి చదివిన విద్యార్థులు హైదరాబాద్‌లో ఆదివారం ఓ కన్వెన్షన్‌ హాల్‌లో సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి సమ్మేళనానికి హాజరు కావడంతో తోటి స్నేహితులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నర్సింహ, రామకృష్ణ, శ్రీనివాస్‌, దేవేందర్‌రెడ్డి, యాదగిరి, రఘుపతి, బుచ్చయ్య, సుధాకర్‌రెడ్డి, నారాయణరెడ్డి, ప్రకాశ్‌, యాదమ్మ, లక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సమ్మేళానికి హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement