ఆలయంలో చొరబడి.. హుండీల అపహరణ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో చొరబడి.. హుండీల అపహరణ

Apr 20 2026 9:29 AM | Updated on Apr 20 2026 9:29 AM

హయత్‌నగర్‌: నగర శివారులోని ఓ ఆలయంలో చొరబడిన దుండగులు రెండు హుండీలను అపహరించుకుపోయిన సంఘటన ఆదివారం హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తొర్రూర్‌–బ్రాహ్మణపల్లి రహదారిలోని ప్రసిద్ధ రంగనాథ స్వామి ఆలయం గ్రిల్స్‌ తాళాలు శనివారం అర్ధరాత్రి దాటాక దుండగులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడున్న రెండు హుండీలను అపహరించుకుని పోయారు. మరుసటి రోజు ఉదయం ఆలయ పూజారి వచ్చి చూడగా గ్రిల్స్‌ పగలగొట్టి ఉన్నాయని గమనించారు. దీంతో ఆయన ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఐ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్‌ వచ్చి వివరాలు సేకరించగా.. ఆలయ నిర్మాణం జరుగుతుండడంతో సీసీ కెమెరాలు పని చేయడం లేదని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement