యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Apr 19 2026 1:44 PM | Updated on Apr 19 2026 1:44 PM

మొయినాబాద్‌: టిఫిన్‌ చేయడానికి వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన కూచిమంచి దుర్గాప్రసాద్‌ యువకుడు కూలీ పనిచేసేవాడు. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో టిఫిన్‌ చేయడానికంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో శనివారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement