● ప్రైవేటు కాలేజీలు నిబంధనలు పాటించడం లేదని మండిపాటు
● అగస్త్య సిబ్బందితో వాగ్వాదం, పరస్పర దాడులు
ఇబ్రహీంపట్నం రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైయివేటు జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎస్‌యూఐ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నందకుమార్ డిమాండ్ చేశారు. ఆదిబట్లలో అనుమతులు లేకుండా కళాశాలల నడిపిస్తున్నారని, వేసవి సెలవుల్లో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి నిర్బంధ విద్యను బోధిస్తున్నారని ధర్నా చేపట్టారు. కళాశాలలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సమయంలో సిబ్బంది, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఆందోళన సద్దుమనిగింది. అనంతరం నందకుమార్ మాట్లాడుతూ.. ఆదిబట్లలో కొనసాగుతున్న అగస్త్య కళాశాల ఒకే అనుమతితో మరో రెండు బ్రాంచులు నడిపిస్తోందని, వేసవి సెలవులు ఇవ్వకుండా ఇంటర్ తరగతులు నిర్వహిస్తోందని ఆరోపించారు. డీఐఓ వెంక్యానాయక్ కళాశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు తరగతులు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.


