రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

శంకర్‌పల్లి: ప్రమాదాల నివారణకు ప్రతీ వామనదారుడు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని మోకిల ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్‌–అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా గురువారం పీఎస్‌ పరిధిలో ప్రయాణించే వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై ప్రయాణించే సమయంలో కారులో సీటు బెల్టు, బైక్‌పై హెల్మెట్‌ తప్పనిసరి అని సూచించారు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లోనూ మద్యం తాగి వాహనాలు నడపొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొదన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన కరపత్రాలను వాహనదారులకు అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చెన్నారెడ్డి, సిబ్బంది రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement