చేవెళ్ల: సామాజిక ఉద్య మ స్ఫూర్తిదారుడు దళిత రత్న అవార్డు గ్రహీత ఇటిక్యాల భిక్షపతి మహానీయుల ఆశయ సాధనలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా చేవెళ్లలోని అంబేడ్కర్ భవన్‌లో గురువారం ఇటిక్యాల భిక్షపతిని విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన ఇటిక్యాల భిక్షపతి గత కొన్నేళ్లుగా సామాజిక కార్యక్రమాలు చేపడుతూ మహానీయుల ఆశయ సాధనలో పనిచేస్తున్నారని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం తనవంతు ప్రయత్నంగా ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా దళితరత్న అవార్డు రావటం సంతోషకరమన్నారు. ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రాజేశ్, జైపాల్, శ్రీనివాస్, దయాకర్, సూర్యప్రకాశ్ తదితరులు ఉన్నారు.


