చరిత్రాత్మక నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

చరిత్రాత్మక నిర్ణయం

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

చరిత్రాత్మక నిర్ణయం

మార్పునకు నాంది

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లకు తుదిరూపం ఇచ్చేందుకు.. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమలులోకి తేవడానికి వీలుగా కేంద్రం తీసుకొస్తున్న మూడు బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై పలువురు నారీమణులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. – సాక్షి, నెట్‌వర్క్‌

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు సమానత్వాన్ని పెంపొందిస్తాయి. దేశాభివృద్ధిలో తీసుకునే నిర్ణయాత్మక అంశాల్లో సీ్త్రల పాత్రకు ప్రాధాన్యత లభిస్తుంది. నారీశక్తి వందన్‌ అదినియమ్‌ బిల్లు చారిత్రాత్మక నిర్ణయం. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కతుంది. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల దౌర్జన్యాలపై చట్ట సభల్లో ప్రశ్నించేందుకు అవకాశం కలుగుతుంది.

– అనితకుమారి, ప్రిన్సిపాల్‌, శ్రీ విద్యాంజలి జూనియర్‌ కళాశాల, ఇబ్రహీంపట్నం

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లతో మహిళలకు ప్రాతినిధ్యం పెరుగుతుంది. సమానత్వాన్ని సాధించే దిశలో ఇదొక మంచి పరిణామం. మహిళల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది. మహిళాల ప్రాతినిధ్యం పెరిగితే సామాజిక అభివృద్ధి, పాలనాపరమైన నిర్ణయాల్లో కొత్త ఆలోచనలు, విభిన్న అభిప్రాయాలకు అవకాశం ఉంటుంది.

– దండె వాణి, న్యాయవాది, ఇబ్రహీంపట్నం న్యాయస్థానం

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయం. మహిళల రాజ కీయ భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళల సాధికారతకు తీసుకొచ్చిన ఈ బిల్లుతో సముచిత స్థానంతోపాటు గౌరవం లభిస్తుంది. మహిళల అభ్యున్నతికి ఇది మరింత దోహదపడుతుంది. దేశ అభివృద్ధికి ముందడుగు.

– బాణాల శ్రీలావణ్య, సరూర్‌నగర్‌

మిహిళా సాధికారతతోనే దేశం అభివృద్ధి సాధ్యం. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కల్పనతో సమాజంలో ప్రాధాన్యత పెరుగుతుంది. సమాభివృద్ధిలో మహిళల పాత్ర మరింత పెరుగుతుంది. మహిళా బిల్లుకు చట్టణ సవరణ చేయడం హర్షణీయం. ఇది చరిత్రాత్మక మార్పునకు నాంది.

– సుశీల, ఎస్‌ఐ, షాద్‌నగర్‌

భాగస్వామ్యం పెరుగుతుంది

మహిళా రిజర్వేషన్‌ చట్ట సవరణతో రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం నారీ శక్తి వందన్‌ అదినియమ్‌ బిల్లు తేవడం హర్షణీయం. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే ఈ చట్టం అమల్లోకి రావడం మరింత ఆనందంగా ఉంది. అప్పటి నుంచి చట్టసభల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

– పడమటి మమతారెడ్డి, కౌన్సిలర్‌, పెద్దమంగళారం, మొయినాబాద్‌ మున్సిపాలిటీ

ప్రాధాన్యత లభిస్తుంది

మహిళా రిజర్వేషన్లతో రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయం. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్‌పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రిజర్వేషన్లు కల్పించడంతో మహిళలకు సముచిత ప్రాధాన్యత లభిస్తుంది. మహిళా సాధికారతతోనే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది.

– యాట గీత, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌, ఆమనగల్లు

మహిళలకు సముచిత స్థానం

పోరాడే అవకాశం

అభ్యున్నతికి దోహదం

Advertisement
 
Advertisement
Advertisement