మహిళా శక్తి ఎంతో గొప్పది | - | Sakshi
Sakshi News home page

మహిళా శక్తి ఎంతో గొప్పది

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

షాద్‌నగర్‌రూరల్‌: సమాజంలో మహిళాశక్తి ఎంతో గొప్పదని పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ బన్సీలాల్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమాజంలో సర్పంచ్‌ల పాత్ర కీలకమైనదని, ప్రభుత్వం అందిస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించాలని అన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి పారదర్శక పాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ శ్రీలత, డీపీఓ సురేష్‌మోహన్‌, డీసీపీ శిరీష, ఆర్డీఓ సరిత, తహసీల్దార్‌ నాగయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ అగ్గనూర్‌ బస్వం, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ బాబర్‌అలీఖాన్‌, సీడీపీఓ ఉదయ, ఎంఈఓ మనోహర్‌, ఎంపీఓ జయంత్‌రెడ్డి, ఏఓ నిషాంత్‌కుమార్‌, ఏపీఓ అరుణ, ఏపీఎం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement