వీఎం హోంలో మంత్రి అడ్లూరి | - | Sakshi
Sakshi News home page

వీఎం హోంలో మంత్రి అడ్లూరి

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

హుడాకాంప్లెక్స్‌: షెడ్యూల్‌ కులాల అభివద్ధి శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ గురువారం సరూర్‌నగర్‌లోని వీఎం హోం రెసిడెన్షియల్‌ పాఠశాలను సందర్శించారు. ఎన్‌సీసీ విద్యార్థులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పాఠశాలలోని క్రీడాప్రాంగణంలో క్రికెట్‌కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఈ పాఠశాలలో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అంకితభావంతో పని చేస్తుండడం అభినందనీయమని అన్నారు. ఇక్కడి విద్యార్థులు అటు చదువులోనూ.. ఇటు క్రీడల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రస్థాయిలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్యాపరమైన విషయాలు, ఉపాధ్యాయుల పనితీరు, అందుతున్న వసతులు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల గౌరవ కార్యదర్శి జె.రామారావు, ప్రిన్సిపాల్‌ సి.నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్‌ లక్ష్మీపార్వతి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వై.వి. శివప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకుడు చిక్కుల్ల శివప్రసాద్‌ తదితరులు ల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement