కందుకూరు: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీనివాస్ సూచించారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని నవారు బాల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో మండల సభ నిర్వహించారు. అధికారులు శాఖల వారీగా ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీల్లో పారిశుద్ధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను అవసరమైన పనులకు ఖర్చు చేయాలన్నారు. అరైవ్–అలైవ్ లో భాగంగా ప్రతి పాఠశాలలో క్షేమంగా ఇంటికి చేరుకోండి అనే పాఠ్యాంశాన్ని పిల్లలకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, మండల ప్రత్యేకాధికారి సుధారాణి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, ఎంపీడీఓ సరిత, తహసీల్దార్ గోపాల్, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


