కిడ్నాప్‌ కేసులో ‘మంచిరెడ్డి’ సరెండర్‌ | - | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో ‘మంచిరెడ్డి’ సరెండర్‌

Apr 17 2026 11:14 AM | Updated on Apr 17 2026 11:14 AM

ఇబ్రహీంపట్నం: బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఆకుల యాదగిరి కిడ్నాప్‌ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అతని కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి హైకోర్టు ఆదేశం మేరకు గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో సరెండర్‌ అయ్యారు. ఈ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం వీరికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. కిషన్‌రెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి జామీన్‌ పత్రాలపై సంతకాలు చేసి పోలీస్‌ అధికారులకు సమర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికార పార్టీ తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా న్యాయం కోసం తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాలను కై వసం చేసుకుందని, దొడ్డిదారిన చైర్మన్‌ పీఠం ఎక్కేందుకు అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement